PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సేవకే.. అంకితం..

1 min read

ఓడినా.. ప్రజల్లోనే ఉన్నా….

  • గెలిచినా.. దగ్గరుండి సేవ చేస్తా..
  • కర్నూలు వాసులంతా నా కుటుంబ సభ్యులే..
  • ఒక్క అవకాశం ఇవ్వండి.. కర్నూలును స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్దుతా..
  • హై కోర్టు బెంచ్ తీసుకొస్తా…
  • యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా…
  • భావితరాల భవిష్యత్​కు… భరోసా ఇస్తా..
  • సొంత మేనిఫెస్టోతో.. ప్రజల్లో దూసుకెళ్తున్న టీజీ భరత్
  • టీజీ భరత్​ పై …  ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం..
  • గెలిపించేందుకు సిద్ధమంటూ.. వెల్లివిరుస్తున్న సంకేతాలు..

కర్నూలు అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తా… ఎవరినైనా కలుస్తా…ఎంతైనా వెచ్చిస్తా….నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ… టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్​ మాటలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న టీజీ భరత్​… ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే…  కర్నూలును స్మార్ట్​ సిటీగా అభివృద్ధి చేయడంతోపాటు యువతకు ఉపాధి, హై కోర్టు బెంచ్​ తీసుకొస్తానని భరోసా ఇస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత మేనిఫెస్టోను విడుదల చేసి…. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ప్రజల్లో నమ్మకం కల్పించడంలో సఫలీకృతుడయ్యాడు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న టీజీ భరత్​కు వస్తున్న విశేష స్పందనే… ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

పల్లెవెలుగు, కర్నూలు:“ వైసీపీ ఎమ్మెల్యేలా… నేను అబద్దం చెప్పను… మోసం చేయను… దోచుకోను…. ఉన్నది ఉన్నట్లు చెబుతా.. సేవ చేస్తా… నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇవ్వండి ’’ అని … వేడుకుంటున్న టీజీ భరత్​కు ఈ సారి ఎన్నికల్లో గెలుపు తథ్యమంటూ ప్రజా సర్వేలు చెబుతున్నాయి. రాజకీయ కుటుంబానికి చెందిన టీజీ భరత్​ మాట ఇస్తే… చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో మెండుగా ఉంది. గత ఎన్నికల్లో అతి స్వల్పమెజార్టీతో ఓడిన టీజీ భరత్​… ఈ సారి అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కర్నూలు ప్రజలే తీసుకుంటారనే చర్చ ప్రధానాంశంగా మారింది. 

కర్నూలు అభివృద్ధి.. నా బాధ్యత…:

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్​ మొదలైంది. కానీ.. ప్రజలే దేవుళ్లుగా భావించే టీజీ భరత్​ కు.. ‘టెన్షన్​’ అనే పదం దరిచేరలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీజీవీ కుటుంబం ప్రజలకు చేసిన సేవలు… మరే ఇతర రాజకీయ నాయకుడు చేయలేడనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఫ్యాన్​ హవా… రాష్ట్రమంతా ఉన్నప్పుడే అతి  తక్కువ ఓట్లతో టీజీ భరత్​ పరాజయం పాలయ్యాడు.  “ ఓడినా ప్రజల్లో ఉన్నా… గెలిస్తే .. దగ్గరుండి సేవ చేస్తా… ఒక్క అవకాశం ఇవ్వండి.. అంటూ  టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్​  విజ్ఞప్తికి విశేష స్పందన వస్తోంది. ‘ కర్నూలు అభివృద్ధి నా బాధ్యత… నన్ను గెలిపించే బాధ్యత మీదే…’ అని చెబుతున్న టీజీ భరత్​కు…  అదే స్థాయిలో గెలిపించేందుకు మేం సిద్ధం అంటూ ప్రజల నుంచి సంకేతాలు వెల్లివిరుస్తున్నాయి.

టీజీ భరత్​ మేనిఫెస్టో… అదుర్స్​…:

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తా… ఎవరినైనా కలుస్తా… ఎంతైనా ఖర్చు చేస్తా… అంటూ భరోసా కల్పిస్తున్న టీజీ భరత్​కు జనాలు నీరాజనం పలుకుతున్నారు. పార్టీ మేనిఫెస్టోతోపాటు తన సొంత మేనిఫెస్టోకు ప్రజలు ఆకర్షితులవున్నారు.  కర్నూలు స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్ది.. రాష్ట్రంలోనే గొప్ప నగరంలో రూపొందిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత… నన్ను గెలిపించే బాధ్యత మీదే అని చెప్పడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.

హై కోర్టు బెంచ్​.. తీసుకొస్తా…:

కర్నూలు న్యాయ రాజధాని అంటూ… ఊకదంపుడు మాటలు చెప్పే.. వైసీపీ నాయకుల మాటలు నమ్మి.. మరోసారి మోసపోవద్దని  టీజీ భరత్​ ప్రజలను వేడుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన… కర్నూలుకు హై కోర్టు బెంచ్​ తీసుకురావడం తన బాధ్యత అని చెప్పుకొస్తున్నారు.

పరిశ్రమలు..ఉపాధి…:

తనను గెలిపిస్తే… కర్నూలు నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు ఉపాధి కల్పిస్తానని  టీజీ భరత్​ భరోసా కల్పిస్తున్నాడు. ప్రముఖ కంపెనీలతో ఆరు నెలలకోసారి జాబ్​ మేళా ఏర్పాటు చేసి… ఉపాధి మెరుగు పడేలా చేస్తానన్నారు. స్టార్టప్​ కంపెనీ ఆరంభించి.. యువతను ప్రోత్సహిస్తామని చెప్పడంలో సక్సెస్​ అయిన టీజీ భరత్​ కు యువత  నుంచి మంచి స్పందన వస్తోంది.

మహిళలకు భద్రత… ఆర్థిక భరోసా…:

కర్నూలు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అమ్మ, అక్కా చెల్లెమ్మల భత్రతతోపాటు.. వారికి ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రతి విద్యార్థినీ గ్రాడ్యుయేట్​ అయ్యే విధంగా చూడటంతోపాటు మహిళలకు చేయూత ఇచ్చేలా ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయిస్తాము.  నా కర్నూలు ఆడ పడచులకు ఎలాంటి ఆపద వచ్చినా… మీ అన్నలా.. నేను ఉంటానని భరోసా కల్పిస్తూ… ముందుకు వెళ్తున్నాడు.

 ఆరోగ్యంపై… శ్రద్ధ…:

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని వందశాతం మల్టీ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరిస్తాము. ప్రస్తుత యునానీ ఆస్పత్రిని సొంత నిధులతో రూపురేఖలు మారుస్తా. గర్భిణీలు మరియు ప్రసూతి పిల్లల విభాగాలను మెరుగు పరిచి ఆహ్లాద వాతావరణం కల్పిస్తాము.  దోమల వల్లే వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికున్​ గున్యా, టైఫాడ్​కు స్వస్తిపలికిలే చర్యలు తీసుకుంటా. సీజనల్​ వ్యాధుల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇస్తూ.. విస్తృత ప్రచారం చేస్తున్నారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేసి… తనను గెలిపిస్తే… సొంత డబ్బుతో కర్నూలును అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించే బాధ్యత తనదేనని హామీ ఇస్తున్నారు. ఈసారి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాడు. 

About Author