ప్రజా సేవకు.. అంకితం
1 min read– నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు కార్పొరేషన్: కరోనా వ్యాప్తి కట్టడికి నగర వాసులు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థలో నూతనంగా ఆధునికీకరించిన ఛాంబర్లోకి ప్రవేశించారు. అంతకు ముందు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కమిషనరు డీకే బాలాజి రిబ్బన్ కట్ చేసి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా మేయర్ బి.వై రామయ్య గారు మాట్లాడుతూ… ఇకపై పూర్తి సమయం ప్రజల కోసమే కేటాయిస్తానన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేరుగా తన ఛాంబర్ లో వచ్చి తెలుపవచ్చని చెప్పారు. త్వరలో మున్సిపల్ కార్యాలయన్ని పాలన పరంగా ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందస్తామన్నారు.అలాగే ఏళ్ల తరబడి పేర్కొపోయినా సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. కరోనా కట్టడికి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.అనంతరం అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, మునిసిపల్ ఇంజినీర్ శేషసాయి, డిఈ రవిప్రకాష్ నాయుడు, మేనేజర్ చిన్నరాముడు, మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు, వైఎస్సార్ సిపి నాయకులు తదితరులు మేయర్ గారికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.