సేవకు.. అంకితం
1 min read– పేద మహిళలకు చీరలు పంపిణీ
పల్లెవెలుగు వెబ్, ఆదోని టౌన్ : రాజకీయ నాయకుడిగా.. సామాజిక కార్యకర్తగా.. పేదలకు సేవ చేస్తూ ఉంటానని, ఈ జీవితం.. సేవకు అంకితం అన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్. ప్రజలకు సేవ చేసేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్న ప్రకాశ్ జైన్… పట్టణంలో ఏ సమస్య ఉన్నా తన వద్దకు వస్తే పరిష్కరిస్తామన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం పేద ముస్లిం మహిళలకు 100 చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ జైన్ మాట్లాడుతూ కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు కూలీ పనులు కూడా దొరకడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చ నాయకులు అబ్దుల్ రషీద్, బీజేవైఎం కర్నూలు జిల్లా ట్రెజరర్ సంజయ్పాండే తదితరులు పాల్గొన్నారు.