అంకిత భావంతో సేవలందించిన వరల్డ్ మిషన్ సొసైటీ చర్చి ఆఫ్ గాడ్
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: నగరంలో ఆదివారం ఏపీ ఎస్ ఆర్ టి సి, బస్ స్టాండ్ కూడలి లో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ ఆఫ్ గాడ్ సంఘ సభ్యులు క్లీనింగ్ మూమెంట్ ( స్వచ్చంద సేవ)అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికిముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ కడప డిపో మేనేజర్ శ్రీ ఢిల్లేశ్వర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ 1964 సం లో ది వరల్డ్ మిషన్ సొసైటీ చర్చి అఫ్ గాడ్ స్థాపించడం జరిగిందన్నారు, ఈ సంస్థ స్థాపించినప్పటి నుండి 40 లక్షల మంది ప్రజలు సంఘ పరిధి లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు,ప్రపంచమంతటా పరలోకపు తల్లి ప్రేమను పంచాలని ప్రపంచ వ్యాప్తం గా ప్రజలంతా ఆరోగ్యం గా , సుఖ సంతోషాలతో జీవించాలనే ధ్యేయం తో ఈ సంస్థ పని చేస్తుందన్నారు ఆయన తెలిపారు, ఆ సంస్థ రిప్రెసెంటివ్ జి,ఎబ్ నజీర్ మాట్లాడుతూ, పరలోకపు తండ్రి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ ,పరలోకపు తల్లి నూతన యేరుషలేము ను విశ్వశిస్తూ,వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ ఆఫ్ గాడ్ స్థాపకుడైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి తెలియజేశారు, ప్రపంచం అంతటా పరలోక తల్లి ప్రేమను పంచటం కాబట్టి పరలోకపు తల్లి ప్రేమను ఈ ప్రపంచానికి పంచడానికి సేవ కార్యక్రమం తో ముందు కెళ్ళడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు, ప్రపంచ వ్యాప్తం గా 170 దేశాలలో 4.5 మిలియన్ ప్రజలు ఈ సంఘంలో సభ్యులు ఉన్నారన్నారని తెలియజేశారు.