PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవంబర్ 8న జరిగే బంద్ ను జయప్రదం చేయండి: DYFI-SFI

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నవంబర్ 8వ తేదీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షణకే కడప లో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు విద్యాసంస్థల బంద్నంద్యాల పట్టణంలో నవంబర్ 8వ తేదీన చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు పట్టుకొని గోడలకు అతికిస్తూ ప్రచారం చేయడం జరిగిందని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఎస్ఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి మధు కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రువ హక్కు అనే నినాదంతో పుట్టుకొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేటు వారికి చారు చౌకగా అప్పగించాలని చూస్తుందని దీన్ని వ్యతిరేకిస్తున్నామని అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ను మేము నడపలేము అంటూ కేంద్రం ఎందుకు చెప్తుందో అర్థం కావడం లేదు ఆనాడు కరోనాకాలంలో దేశానికే ఆక్సిజన్లు ఇక్కడి నుంచే సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపనకై 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన స్టీల్ ప్లాంట్ అది అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోమని వారు తెలిపారు. అదే కడప ఉక్కు రాయలసీమకు హక్కు అంటూ కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎప్పటినుండో కోరుతున్నామని అయితే గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. అలాగే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకసారి కాక రెండుసార్లు శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారే కానీ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటున్న పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడంలో వైసిపి నిర్లక్ష్యం వహిస్తుంది ఆంధ్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర మోసం చేస్తుందని వారు తెలిపారు. వైసిపి ప్రభుత్వం నాయకుల అవినీతి లపై కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు ఉందని ఈరోజు వైసీపీ ప్రభుత్వం వారి ప్రశ్నించకుండా అని అడుగుతున్నామని రాష్ట్ర అభివృద్ధిని అడగవలసిన ప్రభుత్వం కేంద్రం దగ్గర చేతులు కట్టుకొని ఉండటం తగదలి అదే విధంగానే ఆంధ్రుల పౌరుషాన్ని బిజెపికి తాకట్టు పెడుతుందని ఇప్పటికైనా అధికారం పూర్తి కావస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లేని పక్షాన ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాటాలు నేర్పుతారని తగిన బుద్ధి చెబుతారని అలాగే నవంబర్ 8వ తేదీన చేపట్టిన విద్యాసంస్థల బందును నంద్యాల పటంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు అందరూ కలిసి కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నినాదానికి అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ రెండు డిమాండ్లు ఆంధ్ర రాష్ట్ర లో ఉన్న ప్రతి విద్యార్థి యువతీ యువకులు ప్రజల హక్కులు వాటికోసం చేసే పోరాటాల్లో కలిసి రావాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఎస్ఎఫ్ఐ నాయకులు మధు కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, గౌతమ్ ,మధు, తదితరులు పాల్గొన్నారు.

About Author