PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వచ్చే ఎన్నికల్లో గౌరు , భూమా అఖిల ప్రియలకు ఓటమి తప్పదు

1 min read

– టిడిపి నాయకులకు బీసీలు గుణపాఠం చెబుతారు
– బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్న టిడిపి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నదని నందికొట్కూరు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు అన్నారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ఎంపీపీ కార్యాలయంలో అల్లంపూర్ రవి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకుంటున్న టిడిపి నాయకులు రాష్ట్రంలో బీసీలను అనగదొచ్చేందుకు కుట్ర పడుతుందనారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయములో ఎస్సీ ఎస్టీ బీసీ లకు సముచిత స్థానం కల్పించి అగ్రభాగాన నిలబెడతానని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 16 సీట్లు బీసీలకు కేటాయించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు ఉమ్మడి జిల్లా బీసీ బోయ వాల్మీకి వర్గానికి చెందిన నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన బోయ అలంపూర్ మధుసూదన్ కు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ సీటు కేటాయించడం జరిగింది. అయితే టిడిపి వారు సొంత పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా అనామకులైన అభ్యర్థులతో పోటీగా నామినేషన్ వేయించి బరిలో నిలపడం చాలా సిగ్గుచేటుగా ఉందని వారు ఖండించారు. వాల్మీకులను చట్టసభలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న టిడిపి నాయకులు గౌరు వెంకట్ రెడ్డి, భూమా అఖిలప్రియలకు శిఖండి రాజకీయాలకు నిదర్శనం అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీకి వాల్మీకుల ఓటు బ్యాంకు అవసరం లేదా అని ప్రశ్నించారు. కర్నూలు ,అనంతపురం జిల్లాలో వాల్మీకి జనాభా అత్యధికంగా ఉన్నందున వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్, నగర మేయర్ గా ఇచ్చి బీసీలకు న్యాయం చేయడం జరిగిందన్నారు. టిడిపి వారు ఎంత కుయుక్తులు చేసినా బోయ మధుసూదన్ ను ఎమ్మెల్సీగా వాల్మీకులు పార్టీలకతీతంగా పదింతల మెజార్టీతో గెలిపించి జిల్లా నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు యాట ఓబులేష్, నాగటూరు వెంకటేష్, గొల్ల గోవిందు, పాపన్న, శేఖర్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author