PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి…

1 min read

– డి రాజా సాహెబ్ 

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని అక్టోబర్ 16వ  తేదీన సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  సిపిఐ  మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య పిలుపు ఇచ్చారు ఆదివారం పత్తికొండ మండలంలోని జూటూరు మండగిరి గ్రామాల్లో రైతులను కలుసుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ , కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు లేక కేవలం వర్షాల  మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కర్నూలు జిల్లా రైతులకు ఏటేటా కరువు కోరలు చిక్కుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు నిరంతరం కర్నూలు జిల్లాలో చూస్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరం పదునైన వాన ఒక్కసారైనా కురవలేదు రైతులంతా పీకలోతు కరువు కోరల్లో చిక్కుకున్న జిల్లాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎంపీ మరియు ఎమ్మెల్యేలు గానీ పంట పొలాలు పరిశీలించిన పాపను పోలేదని పోనీ అసెంబ్లీలో ఉన్న కరువు గురించి మాట్లాడతారంటే ఒక ఎమ్మెల్యే కూడా రైతు పంటల పైన గాని రైతు కష్టాలు మీద గాని నోరెత్తి  మాట్లాడలేదు 2023 సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురువని కారణంగా రైతులు వేసిన ప్రధాన పంటలు పత్తి, వేరుశనగ, కంది, ఆముదము, జొన్న, కొర్ర ,తదితర పంటలు మొలక దశలోనే వాడిపోయి ఎండిపోవడంతో పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని విత్తనాలు ఎరువులు సేద్యపు ఖర్చుల కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు చేతికి రాక నష్టపోయారు.ఖరీఫ్ సీజన్  ముగిసిపోయింది కాబట్టి కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మొత్తం మాఫీ చేయాలని, సిపిఐ,ఏ.పీ.రైతు సంఘాల ఆధ్వర్యంలో దశల వారిగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం  దుర్మార్గం అన్నారు. కర్నూలు జిల్లా ప్రజలు వైసిపి ప్రభుత్వానికి  స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని వైసిపి ప్రభుత్వ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం జిల్లా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించరన్నారు. కరువు జిల్లాగా ప్రకటించాలని ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ  చెవిటి వాడి ముందు  శంఖం ఊదినట్లు ఉంది తప్ప  ప్రజా ప్రతినిధులకు స్పందన లేకుండా పోయిందని వారు విమర్శించారు. కావున సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ తో పాటు రైతులు  బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రకాల పంట రుణాలు రద్దు చేయాలని,పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పత్తి, వేరుశనగ, ఆముదము, కంది, జొన్న పంటలకు ఎకరాకు 40వేల పంట నష్టపరిహారం, ఉల్లి,మిర్చి మరియు ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని, పశువులకు పశుగ్రాసం పంపిణీ చేయాలని, గ్రామాల్లో ప్రజలు వలసపోకుండ ఆపడానికి ఉపాధి హామీపథకం కింద తక్షణమే పనులు కల్పించాలని డిమాండ్ సాధన కోసం అక్టోబర్16 వ సిపిఐ,రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ మహా ధర్నాలో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో  పాల్గొని విజయవంతం చేయాలని వారు వారు పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమం లో శ్రీనివాసులు హనుమంతు సంజురాయుడు సుంకన్న భాస్కర్ రంగన్న తదితరులు పాల్గొన్నారు.

About Author