ఎమ్మార్వో కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 2018లో అమలు చేసిన మేస్ కాస్మెటిక్ చార్జెస్ రద్దుచేసి , నేటి ధరలకు అనుగుణంగా మేస్ కాస్మెటిక్ చార్జెస్ పెంచాలి , ప్రతినెల రెగ్యులర్గా ఇవ్వాలని.. నందికొట్కూరు నియోజవర్గానికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఓపెన్ చేయాలి..ఎస్సీ ప్రైమరీ హాస్టల్ ను ఏర్పాటు చేయాలి.సరైన మౌలిక సదుపాయాలు లేని , ఫుడ్ మెనూ పాటించని హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ ఐ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి కార్యక్రమాని విద్యార్థులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డక్క కుమార్ , శివ పిలుపునిచ్చారు.గురువారం స్థానిక నందికొట్కూరు లోని సుందరయ్య కార్యాలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు శివ , డక్క కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు కనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ప్రతి నెల రెగ్యులర్ గా ఇవ్వాలని. అదే విధంగా నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఓపెన్ చేయాలని , మూతపడుతున్న మౌలిక సదుపాయాలు లేని ఎస్సీ హాస్టల్స్ ని మౌలిక సదుపాయాలు కల్పించి తెరవాలన్నారు. ఎమ్మార్వో కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని సమావేశం లో తీర్మానించారు. నిత్యవసర వస్తువుల ధరలు ఈ కాలంలోనే దాదాపు 250 శాతం పెరిగాయి. మేస్ కాస్మోటిక్ చార్జీలు మాత్రం పెంచలేదు. ప్రతి విద్యార్థికి 2600 కిలో కేలరీల శక్తినిచ్చే పౌష్టికాహారం అందించాలని జాతీయ పౌష్టిక ఆహార సంస్థ పేర్కొంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చేటువంటి భోజనంలో కేవలం 1100 కిలో క్యాలరీలు మాత్రమే ఉంటున్నాయి ఫలితంగా సరైన పౌష్టిక ఆహారం అందగా విద్యార్థులు ఎముకల బలహీనత రక్తహీనత డయోరియా మలేరియా తలనొప్పి కడుపునొప్పి కంటి చూపమని తగ్గించడం వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక వాంతులు చేసుకొని ఆసుపత్రిలపాలు అవుతున్నారు. చదువులపై దృష్టి పెట్టలేక మధ్యలో ఆగిపోతున్నారు. ప్రతి సంవత్సరం మెస్ చార్జీలు పెంచేందుకు శాశ్వత వార్షిక సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలి. 2018లో అమలు చేసిన మేస్ కాస్మెటిక్స్ చార్జెస్ నేటికీ విద్యార్థులకు అందజేస్తున్నారు. వాటిని రద్దు చేసి నేటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి నాణ్యమైన పోషక ఆహారం అందజేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని . ఇప్పటిదాకా హాస్టల్స్ లో ఉన్న విద్యార్థుల పరిస్థితి పట్టించుకోలేదు . వెంటనే మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని హాస్టల్ విద్యార్థులు అంత కలిసి రేపు జరగబోయే ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సహయకార్యదర్శి ఇమ్రాన్, శ్రీకాంత్ , ఉపాధ్యక్షుడు నవీన్ తదితరుల పాల్గోన్నారు.