వైసీపీని ఓడిస్తేనే ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులకు రక్షణ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైసిపి అభ్యర్థులను ఓడించడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ, ప్రజాస్వామిక హక్కులని కాపాడుకోగలమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిపకీరు సాహెబ్ ,సిఐటియు మండల అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు, శుక్రవారం ,మండలంలోని బిజినవేముల గ్రామంలో పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి లను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పక్కిరి సాహెబ్, సిఐటియు మండల అధ్యక్షులు వి. ఆంజనేయులు మాట్లాడుతూ చదువుతున్న విద్యావంతులు గా మన ఓటును ఒక మంచి నాయకునికి వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉద్యోగుల హక్కులకు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని ఉపాధ్యాయుల ఆత్మ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థను నిర్విరం చేస్తున్నారు.. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు.. దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సందర్భంలో ప్రజల వైపు నిలబడి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,కార్మిక హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ అండగా నిలుస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులు పోతుల నాగరాజు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 27 వద్ద, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి బ్యాలెట్ సీరియల్ నెంబర్ 3 వద్ద ,ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలికి పంపించాలని కోరారు.