NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిగ్రీ.. ఇక నుంచి నాలుగేళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొగ్రామ్‌కి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో మార్చి 10న నిర్వహించిన సమావేశంలో నాలుగేళ్ల కోర్సు అమలు విధానాన్ని నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం నాలుగేళ్ల ప్రొగ్రామ్‌లో ఒక్కొక్కటి 90 రోజుల చొప్పున మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు సెమిస్టర్లలో విద్యార్థులు మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రం, గణితం, వృత్తి విద్యకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు. మూడో సెమిస్టర్‌ ముగిసిన తర్వాత ప్రతీ విద్యార్థి డిగ్రీలో తన మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి ఆసక్తి, అప్పటిదాకా పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా సబ్జెక్టుల కేటాయింపు ఉంటుంది. ఏడు, ఎనిమిది సెమిస్టర్లలో విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులోని ఏదైనా అంశంపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.

                                

About Author