90 రోజుల్లో పట్టాలు ఇవ్వాలి :కౌన్సిలర్
1 min read– మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు
పల్లెవెలుగు, వెబ్, ఆత్మకూరు: అర్హులైన ప్రతి పేద వారికి 90 రోజుల్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని శనివారం నాడు ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు పేదలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు . 21 వ వార్డు కౌన్సిలర్ బోయ లక్ష్మమ్మ అధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు తమకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక వైపు మున్సిపల్ సాధారణ సమావేశం జరుగుచుండగా మరోవైపు మహిళలు ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి పేద వారికి 90రోజుల్లో ఇంటి స్థలాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏడాది క్రితం ధరకాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. నవరత్నాలో బాగంగా ముఖ్యమంత్రి జగనన్న తెలిపిన విధంగా అర్భన్ కాలనీలో ఇల్లు లేని ప్రతి పేద వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . కౌన్సిలర్ బోయ లక్ష్మమ్మ మాట్లాడుతూ ఏడాది క్రితం అప్పటి కమిషనర్ గార్కి ధరకాస్తు చేసుకున్నా పలితం శూన్యం అని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసు కొని గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల ప్రకారం అర్హులైన ప్రతి పేద వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలి అని ఛైర్మన్ , కమిషనర్ గార్కి ధరకాస్తు లు సమర్పించారు . ధరకాస్తు చేసుకున్నా వారి పేరున తిరుగు రశీదు తీసుకొని ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అర్బన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.