ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు : ఎస్టీయూ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని ఎస్ టి యు రాష్ట్ర కౌన్సిలర్ కొత్తపల్లి సత్యనారాయణ హితవు పలికారు. బుధవారం పత్తికొండ ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సబ్ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘం సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు కమిటీల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో కావాలని తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. పండగ పూట తీపికబురు వస్తుందని ఆశగా ఎదురు చూడడం తప్ప ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదకొండవ పిఆర్సి ముప్పై తొమ్మిది నెలలు గడిచినా పత్తా లేకుండా పోయిందని, పెండింగ్ లో ఉన్న 5 డి ఏ లకు దిక్కే లేదని విచారం వ్యక్తం చేశారు. సిపిఎస్ ను అధికారంలోకి వచ్చిన వారం లోపు రద్దు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పదకొండవ పిఆర్సి నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం బయటకు పోవడానికి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టియు సబ్ కమిటీ కన్వీనర్ సుంకన్న, బీరప్ప, లక్ష్మీపతి, చంద్రశేఖర్ రెడ్డి, మారుతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.