మహానందయ్య ఫోటో తొలగించండి… ఆ “జాదు” ఆదేశం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానం కార్యాలయంలోఏర్పాటుచేసిన మహానందయ్య చిత్రపటాన్ని వెంటనే తొలగించాలని ఆర్ జె డి ఆ “జాదు” మంగళవారం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్యం రాక ముందు పూర్వం నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన మహానంది దేవస్థానం ఉందని ఎవరికి తెలియదు. ఆ ప్రాంతమంతా అటవీ జంతువులు తిరగడంతో పాటు నర మానవుడు కూడా ప్రవేశించలేని ప్రాంతంగా ఉండేదని గతించిన పెద్దలు పేర్కొనేవారు. అలాంటి సమయంలో మహానందయ్య అనే మహానుభావుడు మహానంది అనే ఒక క్షేత్రం అక్కడ ఉందని బయటి ప్రపంచానికి తెలియజేయడంతో పాటు ఆలయ అభివృద్ధి పరిచి అప్పట్లోనే నిత్యం ఉదయం సాయంత్రం పూజ కార్యక్రమాలు నిర్వహించి నంద్యాలకు చేరుకునే వారని నానుడి. కాలక్రమేణా క్షేత్రం అభివృద్ధితోపాటు దాదాపు 55 ఎకరాల భూమిని దానం చేయడంతో పాటు ఆలయ అభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆ మహానుభావుడి ఫోటో తొలగించమని స్థానిక ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ని ఆదేశించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అక్కడ ఉన్న పత్రిక విలేకరులతో పాటు, స్థానిక సిబ్బంది మహానందయ్య గురించి తెలపగా అలాంటివారు కోకొల్లలుగా ఉన్నారని అందరి ఫోటోలు కార్యాలయంలో ఏర్పాటు చేస్తారా అని ఈవోను ప్రశ్నిస్తూ మరలా వచ్చేసరికి ఆ చిత్రపటం అక్కడ ఉండకూడదని అవహేళన చేస్తూ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. పై స్థాయిలో ఉన్న అధికారులకు ఇలాంటివి మామూలే నా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. మరి కొన్ని క్షేత్రాల్లో రాజుల పేర్లు వారి శిల్పాలు ఉన్నాయి వాటిని తొలగిస్తారా…. అధికారులు స్థానికంగా ఉన్న వాటిపై అవగాహన లేక అలా ప్రవర్తిస్తున్నారా.. లేక నేను పై అధికారిని కదా నేను చెప్పిందే వేదం అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మహానందయ్య చిత్రపటాన్ని తొలగిస్తే స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురు అవడంతో పాటు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని సమాచారం. దీనికి బాధ్యత అధికారులు వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఆలయ చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఏమిటి లాభం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.