ఈ 4 యాప్ లు మీ మొబైల్ నుంచి డిలీట్ చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ : కొన్ని ప్రమాదకర యాప్ లను వినియోగదారుల మొబైల్ నుంచి డిలీట్ చేయాలని ఎస్బీఐ సూచించింది. ఎనీడెస్క్, క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూయర్, మింగిల్ వ్యూ యాప్ లను మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవద్దని ఎస్బీఐ వినియోగదారులకు సూచించింది. ఈ నాలుగు యాప్ లతో వినియోగదారుల అకౌంట్లలో డబ్బు ఖాళీ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నాలుగు యాప్ లను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల దాదాపు 150 మంది ఎస్బీఐ వినియోగదారులు 70 లక్షల దాక నష్టపోయారని ఎస్బీఐ చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ తరహా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నాలుగు యాప్ లను ఇన్స్టాల్ చేసుకోవద్దని ఎస్బీఐ సూచిస్తోంది. యూపీఐ ఫ్లాట్ ఫారమ్ వినియోగించేటప్పుడు కూడ జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ సూచించింది. మీకు తెలియని నెంబర్లను క్యూఆర్ కోడ్, యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వస్తే తిరస్కరించాలని సూచించింది. ఏ విధమైన లావాదేవీలు ఉన్నా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని ఎస్బీఐ తెలిపింది. ఏదైన మోసం జరిగిందని తెలిస్తే .. 1800111109, 9449112211, 08026599990 ఈ నెంబర్లను సంప్రదించాలని ఎస్బీఐ తెలిపింది. 155620 నెంబర్ ను ఉపయోగించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.