ప్రభాస్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు !
1 min readపల్లెవెలుగువెబ్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చెందిన టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా… పలు వర్గాలు టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆదిపురుష్’ సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ‘ఆదిపురుష్’ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా సదరు సంస్థ కోర్టును కోరింది.