ఢిల్లీ అతలాకుతలం.. 19 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం
1 min read
పల్లెవెలుగు వెబ్ : భారీ వర్షాలతో ఢిల్లీ చిగురుటాకులా వణికిపోయింది. 19 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురవడంతో అతలాకుతలమైంది. సెప్టంబర్ నెలలో కురవాల్సిన వర్షమంతా ఒక్కరోజులోనే కురవడంతో ఢిల్లీ తడిసిముద్దయింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 112.1 మి.మీల వర్షపాతం నమోదైంది. ఢిల్లీ చుట్టుపక్క ప్రాంతాలు నోయిడా, గురుగ్రామ్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రికార్డుల ప్రకారం 2002 సెప్టంబర్ 13న ఢిల్లీలో 126 మి.మీల వర్షపాతం నమోదైంది. 1963 సెప్టంబర్ 16న ఒక్కరోజు 172 మి.మీల వర్షం కురవడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది.