ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశమంతా ఈడీ సోదాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మంగళవారం సోదాలు చేస్తోంది. అయితే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరగడం లేదు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ మంగళవారం ఢిల్లీ సహా గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 35 చోట్ల సోదాలు జరుపుతోంది. ఈ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రుకు చెందిన ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితుడుతైన మనీశ్ సిసోడియా నివాసం, కార్యాలయాలకు ఈడీ అధికారులు రాలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి.