ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు హర్షం వ్యక్తం
1 min read– పెరికే వరప్రసాదరావు, జీవన కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి పెరికే వరప్రసాద్, జీవన్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు, అసెంబ్లీలో ఈవేళ ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాeతీయ అధ్యక్షులు పెరికే వరప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు, హోం మంత్రి తానేటి వనిత సహకారంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఘనంగా సత్కరించడం జరిగింది. గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 ఆగస్టు 2వ తేదీన దళిత క్రైస్తవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించి పార్లమెంట్లో చట్టం చేయాలని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి పార్లమెంటుకు రిక్రూమెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ పాస్టర్ జీవన్ కుమార్ ముఖ్యమంత్రి ని కలిసి దుశ్యాలవతో సత్కరించడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కోటికి మందికి పైగా ఉన్న క్రైస్తవులకు ఎంతో మేలు జరుగుతుందని రెవరెండ్ పాస్టర్ జీవన్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సిగ్గు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని అదేవిధంగా బౌద్ధమతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారని దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరడం జరిగిందని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.