రమణీయం..రథోత్సవం
1 min readపల్లెవెలుగు, శ్రీశైలం ;
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో రథశాలవద్దకు తీసుకొచ్చారు. ఆ తరువాత రథాంగపూజ, హోమం, రథాంగబలిని స్థానాచార్యులు పూర్ణానంద ఆచార్యులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చారు. శ్రీశైలం ఆలయ కార్య నిర్వహణాధికారి కేఎస్ రామారావు గుమ్మడి, కొబ్బరికాలు సమర్పించి.. అశేష భక్తజన వాహిని మధ్య రథాన్ని ముందుకు కదిలించారు. రథశాల నుంచి బయలుదేరిన రథం నందిమండపం వరకు వెళ్లి.. అక్కడి నుంచి యథాస్థానానికి చేరుకుంది. రథోత్సవంలో జానపద కళాకారుల నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.