యూట్యూబ్ చూసి భార్యకు డెలివరీ.. శిశువు మృతి
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడులో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యకు యూట్యూబ్ వీడియోలు చేసి డెలివరీ చేశాడు. శిశువు మృతి చెందగా.. భార్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పానపక్కం ప్రాంతంలో ఓ దుకాణం నడుపుతున్న వ్యక్తికి ఏడాది కింద వివాహం జరిగింది. అనంతరం భార్య గర్భం దాల్చింది. తొమ్మిది నెలలు నిండటంతో ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లే బదులు ఇంట్లోనే ప్రసవం చేయాలనుకున్నాడు. యూట్యూబ్ లో వీడియోలు చూడటంతో పాటు సోదరిని అడిగి తెలుసుకున్నాడు. చాలా సేపటికి ఆమె ప్రసవించగా బిడ్డ చనిపోయింది. భార్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. భార్య అనుమతితోనే అతడు డెలివరీ చేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.