NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హారాష్ట్రలో డెల్టా ప్లస్ మ‌ర‌ణాలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన మూడో ద‌శ ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ త‌రుణంలో డెల్టాప్లస్ మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈ వేరియంట్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. దీంతో వైద్య వ‌ర్గాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 66 డెల్టాప్లస్ కేసులు న‌మోదైన‌ట్టు మ‌హారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ముంబ‌యిలో తొలి డెల్టా ప్లస్ మ‌ర‌ణం వెలుగులోకి వ‌చ్చింది. డెల్టా ప్లస్ సోకిన వారిలో 10 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా.. 8 మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఏడుగురు బాధితులు 18 ఏళ్ల లోపు ఉన్నవారు ఉన్నారు. బాధితుల్లో 61 మంది ఇప్పటికే కోలుకున్నార‌ని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

About Author