సౌరభ్ గంగూలీకి డెల్టా ప్లస్ పాజిటివ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : టీమిండియా మాజీ కెప్టన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి డెల్టా ప్లస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్ గా నిర్ధారణ అయినట్టు కోల్ కతలోని వుడ్ లాండ్ హాస్పిటల్స్ వర్గాలు తెలిపాయి. గతంలో కరోన బారినపడ్డ గంగూలీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఆయనకు నెగిటివ్ రావడంతో డిశ్చార్జీ అయ్యారు. తాజాగా ఆయనకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. లక్షణాలు స్వల్పంగా ఉండటంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు.