డెల్టా ప్లస్ వేరియంట్.. వ్యాక్సిన్లు పోరాడగలవా ?
1 min readపల్లెవెలుగు వెబ్: డెల్టా ప్లస్ వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ ఎంత ప్రమాదకరం అన్న అంశం పై పూర్తీ స్థాయి సమాచారం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని పై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఐసీఎంఆర్, ఎన్ఐవి డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్రతను అంచనా వేసే పనిలో పడ్డాయి. తమిళనాట డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ఒక మరణం సంభవించింది. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్ ను కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఎంత వరకు నిరోధించగలవన్న విషయాన్ని ఈ పరిశోధనలో వెల్లడించనున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ ను వీలైనంత వరకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. ఈ వైరస్ వేరియంటే థర్డ్ వేవ్ కు కారణం కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. డెల్టా ప్లస్ వేరియంట్ ఎంత ప్రమాదరమన్న విషయానికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తీ స్థాయిలో లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం 40 కేసులతో వైరస్ తీవ్రతను అంచనా వేయలేమంటున్నారు.