NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ .. అప్రమ‌త్తం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన వైర‌స్ రూపాంత‌రం డెల్టాప్లస్ వేరియంట్ కేసులు తెలంగాణ రాష్ట్రంలోనూ బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ నెల 23 నాటికి రెండు కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించింది. తెలంగాణ‌లో డెల్టాప్లస్ ఉనికి ఉంద‌ని స్పష్టమైంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు 70 డెల్టా ప్లస్ కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించింది. క‌రోన రెండో ద‌శ‌లో డెల్టా వేరియంట్ బీభ‌త్సం సృష్టించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్.. డెల్టా ప్లస్ గా రూపాంత‌రం చెందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆందోళ‌న చెందుతున్నాయి. క‌రోన వైర‌స్ ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లుగా మారింది.

About Author