NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిమెంట్ కు గిరాకీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సిమెంట్‌ డిమాండ్ భారీగా పెర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘దేశవ్యాప్తంగా 2022–23లో సిమెంట్‌ అమ్మకాలు దాదాపు 382 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరుకోవచ్చని అంచనా. గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాల నుండి బలమైన డిమాండ్‌ ఇందుకు కారణం. అధిక తయారీ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా పరిశ్రమకు నిర్వహణ లాభం 270–320 బేసిస్‌ పాయింట్స్‌ తగ్గి 16.8–17.3 శాతం నమోదు కావొచ్చు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–ఫిబ్రవరి కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 323 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. తుఫాన్లు, అకాల వర్షాలతో 2021 నవంబర్‌లో సిమెంట్‌ డిమాండ్‌ పడిపోయింది. డిసెంబర్‌ నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. 2021–22లో ఉత్పత్తి 18–20 శాతం అధికమై కోవిడ్‌–19 ముందస్తు స్థాయి 355 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులని అంచనా’ అని ఇక్రా వివరించింది.

                          

About Author