PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు చేయాలని డిమాండ్..

1 min read

ఐదేళ్లు కావస్తున్న అధికార ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు..

సిఐటియు ఆధ్వర్యంలో వేల సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె

మద్దతు తెలిపిన గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరంను సోమయ్య ప్రార్భించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసిపి అంగన్వాడి కార్యకర్తలు కు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు కానీ, 5 యేళ్లు గడిచిన ఆ హామీ అమలు చేయలేదని ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ఎఫ్ అర్ ఎస్ యాప్ ల పేరుతో పనిభారం పెంచారు అన్నారు. అంగన్వాడి సెంటర్ అద్దెలు, గాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని,  అన్నారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ షాబ్జి  మాట్లాడుతూ నెలల తరబడి బకాయిలు ఉంటే అంగన్వాడి కార్యకర్తలు వచ్చే కొద్ది పాటి జీతాల తో సెంటర్స్ ఎలా నడుపుతారు అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం పెంచలేదని వారు విమర్శించారు.  జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సు ప్రకారం అంగన్వాడి కార్యకర్తలు కు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడి కార్యకర్తలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు . ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు  దుర్గ భవానీ, కార్యదర్శి టి రజినీ,  సీఐటీయూ నగర అధ్యక్షుడు బి జగన్నాధ రావు కార్యదర్శి వి సాయి బాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కు  టిడిపి, జనసేన, సీపీఎం, సీపీ ఐ పార్టీలు , పలు ప్రజా సంఘాలు పాల్గొని మద్దతు తెలిపారు. ఆశా వర్కర్లు 36 గంటల ధర్నాలో భాగంగా రోజు రాత్రి కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు నిద్రిస్తారు. ఇక్కడే వంట వార్పు చేసి భోజనాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలిపారు.

About Author