పెట్రోల్, డీజిల్ డిమాండ్ తగ్గిందట !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇండియాలో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో నెలవారీగా మందగమన ధోరణి కనబడుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, ఆగస్టు (జూలైతో పోల్చితే) మొదటి 15 రోజుల కాలంలో డీజిల్ డిమాండ్ తగ్గింది. పెట్రోల్ డిమాండ్ దాదాపు అక్కడక్కడే ఉంది. జూన్‌తో పోల్చితే జూలైలో అటు పెట్రోల్ ఇటు డీజిల్ డిమాండ్ రెండూ తగ్గిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వినియోగం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుతుపవనాల ప్రారంభకాలం, ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ఎఫెక్ట్ దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో రవాణా, ట్రావెల్ రంగాలు సహజంగా నెమ్మదిస్తాయి. తీవ్ర వర్షాలు వ్యవసాయ రంగం కార్యకలాపాలకు సైతం అడ్డంకిగా నిలుస్తుంది.