PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ బీమా పాల‌సీల‌కు య‌మ డిమాండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్‌ పెరుగుతోంది. కోవిడ్‌ పూర్వం 2019–20లో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్‌ పాలసీల విక్రయం పుంజుకున్నట్లు డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ వెల్లడించింది. తమ అంతర్గత డేటా ప్రకారం ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తాము గతేడాది మొత్తం మీద అమ్మిన ట్రావెల్‌ పాలసీల్లో సుమారు 75 శాతం పాలసీలను ఈ ఏడాది నాలుగు నెలల్లోనే విక్రయించగలిగినట్లు పేర్కొంది. 2021–22లో 12.8 లక్షల ట్రావెల్‌ పాలసీలను విక్రయించినట్లు సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వివేక్‌ చతుర్వేది తెలిపారు.

                                        

About Author