తెలుగు సినిమాకు థియేటర్లు ఇవ్వాలంటూ హిందీ బెల్ట్ లో డిమాండ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సైతం ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ భారీ వసూళ్లను రాబడుతుంది. హిందీ బెల్ట్‌లో ‘కార్తికేయ-2’కు సంబంధించి తొలిరోజు 50షోస్‌ను ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆ షోస్‌ను క్రమంగా పెంచడం మొదలుపెట్టారు. ఫలితంగా ఐదు రోజుల్లోనే షోస్ సంఖ్య 1575కు చేరింది. సినిమా విడుదలైన తొలి రోజు రూ. 7లక్షల వసూళ్లను రాబట్టగా, మూడో రోజు నాటికి ఆ వసూళ్లు రూ. 1.43కోట్లకు చేరాయి. బాలీవుడ్‌లో ఆగస్టు 11న రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘కార్తికేయ’ హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది. అయినప్పటికీ, అన్ని ప్రాంతాల్లోని థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం లేదు. ఫలితంగా కొంత మంది ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను తొలగించి ‘కార్తికేయ-2’ కు థియేటర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.