కొత్త బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : బళ్ళారి డిపో నుండి సాయంత్రం 6 గంటలకు కొత్త బస్సు సర్వీసులు వదిలి మరసిటి రోజు ఉదయం 6 గంటలకు హోలగుంద నుండి బస్సును వదలాలంటూ సోమవారం బళ్లారి కె ఎస్ ఆర్ టి సి డివిజనల్ కంట్రోల్ అధికారి కి డిపిఓ చామరసకి మరియు బళ్ళారి డిపో రెండు లోని ఏ టి ఎస్ చంద్రశేఖర్కి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. విజ్ఞాపన పత్రం అందించిన వారిలో మాజీ సింగల్ విండో చైర్మన్ ఎన్ శ్రీనివాసరెడ్డి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి పెద్దహేట మారెప్ప ఆలు తాలూకా కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ సెల్ చైర్మన్ సీ మంగయ్య మండల యువజన సంఘం నాయకులు కే రంగన్న ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలగుంద నుండి విద్యాభ్యాసం కోసం విద్యార్థులు వ్యాపారం కోసం వ్యాపారస్తులు ఆరోగ్య వైద్య చికిత్స కోసం రోగులు రోగుల బంధువులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు అయితే సాయంత్రం పూట బస్సులు లేక చాలా కష్టపడుతున్నారు బస్సులు లేక నానావసులు పడుతున్నారు కావున బళ్లారి నుండి హాలగుందాకు నైట్ ఆల్ట్ కొత్త బస్సు సర్వీసును వధవలాలని డిమాండ్ చేశారు బళ్ళారి డిపిఓ చామరస మాట్లాడుతూ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా ఎల్లార్తిహోలగుంద పాల్తూర్ బస్సులు నడపడానికి ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు బస్సు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నామని అయితే కొన్ని నిబంధనల వల్ల బస్సులు వదలడానికి వీలు కలగలేదని నెలలోపులే కొత్త సర్వీసు బస్సులు నడపడానికి శ్రద్ధ వహిస్తామని అన్నారు.