PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నా క్యాంటీన్ కూల్చివేత.. ప్ర‌జాధ‌నం వృథా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప న‌గరంలోని పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఉన్న అన్నాక్యాంటీన్ భవనాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ హయాంలో రూ.25 లక్షల వ్యయంతో అన్నాక్యాంటీన్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ త‌ర్వాత‌ క్యాంటీన్లన్నీ మూతపపడ్డాయి. అన్నా క్యాంటీన్‌లో అధికారులు కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

                                          

About Author