PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా టిడిపి కాగడాల ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు నిరసనగా పత్తికొండలో గురువారం టిడిపి కాగడాల ప్రదర్శన చేపట్టింది. కర్నూలు పర్యటన సందర్భంగా నారా లోకేష్ ను అరెస్టు చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక టిడిపి కార్యాలయం నుండి కార్యకర్తలు నాయకులు కాగడాలు చేతబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నాలుగు స్తంభాల కూడలి వరకు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. ప్రజాస్వామ్య పాలనలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని ఉన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి అప్పు చేసి ప్రజల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం గొప్పగా భావిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తిరుపాలు ,టి ఎన్ టి యు జిల్లా అధ్యక్షులు హేమంత్ కుమార్ ,టిడిపి జిల్లా నాయకులు రామానాయుడు ,బీటీ గోవిందు ,సింగం శ్రీనివాసులు ,మీరా హుస్సేన్ ,,ఉస్మాన్ భాష ,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author