డెంగీ జ్వరాలపై అవగాహన పోస్టర్ల విడుదల
1 min read
వ్యాధి లక్షణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముద్రించిన బ్యానర్లు,పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుక్రవారం ఏలూరు కలెక్టరేట్లో విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు,కనుగుడ్లు నొప్పులు డెంగీ లక్షణాలన్నారు.వ్యాధి లక్షణాలపై జిల్లాలోని పిహెచ్‌సిల పరిధిలో అవగాహన,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.దోమతెరలు వాడటం,ఇంటి కిటికీలకు, తలుపులకు జాలీలు బిగించుకోవాలన్నారు.తాగి వదిలేసి కొబ్బరి బొండాలు, పాత టైర్లు,ఖాళీ డబ్బాలు, పనికిరాని వస్తువులలో నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు.ఎయిర్ కూలర్లు,ఫ్లవర్ వాజ్ లు,పూల కుండీలు నీటిని తరచూ మార్చుకోవాలని అన్నారు. డ్రైనేజీలో ఆయిల్ బాల్స్ వేసుకోవాలని,మలాధియాన్ టెక్నికల్ మందును ఫాగింగు ద్వారా దోమలు నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఆర్.మాలిని, డియంవో పి.యస్.యస్. ప్రసాదు,ఏయం వో జె.గోవింద రావు,తదితరులు పాల్గొన్నారు.