PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డెంగ్యూ జ్వరాలను పూర్తి స్థాయిలో నియంత్రించాలి

1 min read

– ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన

పల్లెవెలగు వెబ్ కర్నూలు: డెంగ్యూ జ్వరాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో  స్పందన కార్యక్రమంలో జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా పోస్టర్ లను ఆవిష్క రించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  డెంగ్యూ తో పాటు మలేరియా జ్వరాలను అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం తో పాటు ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ  జ్వరాలు కలుగచేసే దోమలు మంచి నీటిలో మాత్రమే గుడ్లు పెడతాయన్నారు..టైర్స్, కొబ్బరి చిప్పలు, వాడని ఎయిర్ కూలర్స్  లో నిలువ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడం వల్ల ఈ వ్యాధులు వస్తాయని, కాబట్టి వీటిని ఇంటి పరిసరాల్లో లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించి, నీటి నిల్వలను ఖాళీ చేసి, ఆరబెట్టి, నీటి నిల్వల మీద మూత ఉంచుకునే లా ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా లైన్ డిపార్ట్మెంట్ ల అధికారులను కలెక్టర్ ఆదేశించారు…మునిసిపల్, పంచాయతీ రాజ్, ఐసీడీఎస్, విద్య, గ్రామీణ నీటి సరఫరా, సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.. డెంగీ వ్యాధి నివారణపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ముద్రించిన కరపత్రాలను పంచాయతీ సెక్రటరీ ,వాలంటీర్ లు, అంగన్వాడీ, ఆశా, గ్రామ,మండల స్థాయి అధికారుల ద్వారా  ఇంటింటికీ చేర్చి పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  నారపురెడ్డి మౌర్య, DM &HO డాక్టర్ రామగిడ్డయ్య, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author