కాటన్బ్యారేజీపై జనసేన శ్రమదానానికి అనుమతి నిరాకరణ!
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: అక్టోబర్ 2న రాజమండ్రి సమీపంలోని కాటన్ బ్యారేజీపై జనసేన తలపెట్టిన శ్రమదాన కార్యక్రమానికి నీటిపారుదల శాఖ అనుమతికి నిరాకరించింది. బ్యారేజీలపై సాంకేతికంగా మరమ్మతులు చేయని పక్షంలో ఇబ్బందులు ఏర్పడతాయని, ఫలితంగా జనసేన శ్రమదానానికి అనుమతి ఇవ్వలేదని నీటిపారుదల శాఖ పేర్కొటోంది. దీంతో ప్రతికుల పరిస్థితుల దృష్ట్యా శ్రమదాన కార్యక్రమాన్ని రాజమండ్రిలోని హుకుంపేటలో చేపట్టాలని జనసేన నిర్ణయించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన అధినేత రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రమదాన ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా శిథిల రహదారులపై శ్రమదానం చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఏ మాత్రం ఖర్చు చేయలేదని ఆరోపిస్తోన్న జనసేన ఈమేర రోడ్లపై శ్రమదానం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.