PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్తపేట ఉర్దూ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

1 min read

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలను  డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం  గారు మధ్యాహ్నం 1.30 కి  ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆ సమయంలో ఉపాద్యాయులు కొంతమంది మాత్రమే  పాఠశాలలో  ఉండడం ,ప్రధాన ఉపాద్యాయులు కూడా లేకుండా .తరువాత ఒక్కక్కరే రావడంతో  వారిని ఉద్దేశించి సమయపాలన పాటించాలని    తెలిపారు..  ప్రధానోపాధ్యాయునిపై మండిపడ్డారు.పాఠశాలలో పదవ తరగతి గది ని  పరిశీలించారు,తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో,ఏం క్లాస్ ఉంది ఇపుడు మీకు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  సోషియల్ ఉంది అన్నారు,వెంటనే ప్రధాన ఉపాద్యాయులు ను సోషియల్ టీచర్ ఎక్కడ అనగా లీవ్ మీద ఉన్నారు అనగా వెరే వాల్లను క్లాస్ కు  పంపాలి కదా అన్నారు. ప్రదాన ఉపాద్యాయులు నీళ్ళు నమిలారు.టెన్త్ క్లాస్ కాళిగా ఉండకూడదు అని హెచ్చరించారు..విద్యార్థులను ఇంగ్లీషు కు సంబంచి కొన్ని ప్రశ్నలు అడగగా పిల్లలు చెప్పలేక పోయారు.దీంతో ఉపాద్యాయులు అందరినీ పిలిచి వారిపై మండి పడ్డారు,ఇలాగేనా బోధించేది అని ,తన గురించి కూడా ఆంగ్లంలో చెప్పలేపోతున్నారు అన్నారు.త్వరలో మళ్ళీ వస్తాను పరిస్థితి ఇలాగే ఉంటే మీ పై చర్యలు తీసు కుంటామన్నారు. పాటశాల మరుగు దొడ్లు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు.వంట గదిని పరిశీలించి ఏవి సరిగా లేవని అసహణం వ్యక్తం చేశారు. పాట శాల అంతా దుర్గంధం వస్తోందని,మీరు ఏం చేస్తున్నారని నిల దీ సారు. నాడు,నేడు పనులకు సంబంధించి అవినీతి  ఆరోపణలు ఉన్న దృష్ట్యా వాటికి  సంబంధించి రికార్డ్స్ అన్నీ తీసుకుని కార్యాలయానికి రావాలని ఆదేసంచారు.

ఈ కార్య్రమంలో కార్యాలయం సిబ్బంది.హబీబ్, ఉపాధ్యాయులు తదితరులు  పాల్గొన్నారు.

About Author