పోలీసుశాఖ,మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
1 min read
పాదచారులు,వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, మంచినీరు చలివేంద్రం ఏర్పాటు
ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ
పశ్చిమగోదావరి జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వేసవి తీవ్రత దృష్ట్యా సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిల్లా పోలీసు శాఖ మరియు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సోమవారం నాడు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ,ఐపీఎస్. ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూమానవతా దృక్పథంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించడం పోలీసుల మానవీయ బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు సామాన్య ప్రజలకు నిజమైన ఉపకారం చేసే విధంగా ఉంటాయి. అంతేకాక పోలీసులపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరగడానికి దోహదపడతాయి. పోలీసులూ ప్రజలే అన్న భావన బలపడేలా చేస్తాయి. సమాజంలో శాంతి, సమరసతను నిలబెట్టేందుకు పోలీసు శాఖ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎంతో అవసరం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భీమవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.నాగరాజు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి.కాళీ చరణ్, రూరల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస రావు, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన వర్మ మరియు చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి రాజు,ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.
