‘కొణిదేల’కు డిప్యూటీ సీఎం 50 లక్షలు..
1 min read
పవన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఇస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో ఫారం పాండ్ (నీటి కుంట)నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓర్వకల్లు విమానాశ్రయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయ గిత్త జయసూర్య పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.తర్వాత జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కొణిదేల గ్రామానికి మీరు వచ్చారు.అప్పట్లో గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకు మీరు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నా ట్రస్ట్ నుండి సొంతంగా గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఇస్తానని అంతే కాకుండా వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులను గ్రామ అభివృద్ధికి వచ్చే విధంగా తానే అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని డిప్యూటీ సీఎం అన్నారు.సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీలకు నిధులు రావడంతో సర్పంచు మరియు ప్రజా ప్రతినిధులు సీఎం డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని గత పాలకులు విధ్వంసాలు కక్షలకు పాల్పడ్డారే తప్పా అభివృద్ధికి నోచుకోకుండా సొంత అభివృద్ధికే చేసుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.