PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెడ్ల‌కు హెచ్చ‌రిక చేసిన డిప్యూటీ సీఎం !

1 min read

పల్ల‌వెలుగువెబ్ : ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెడ్లు, రెడ్లు కొట్టుకుని చంద్ర‌బాబుకు అవ‌కాశం ఇవ్వొద్ద‌ని హెచ్చ‌రించారు. ‘‘రాష్ట్రంలోని రెడ్లకు ఒక హెచ్చరిక ఇస్తున్నా. మన పార్టీలో ఉండే, మన నవరత్నాలు తీసుకునే కమ్మోళ్లలో ఐదుగురు కూడా టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టరు. రెడ్లు అలా కాదు. ఎందుకో రెడ్లలో ఒకరంటే ఒకరికి పడటం లేదు. ప్రతి గ్రామంలో రెడ్లలో రెడ్లే కొట్టుకుంటున్నారు’’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు) నియమితులైన జ్ఞానేందర్‌రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ కలయిక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గుర్తుంచుకోండి. రెడ్లు కొట్టుకుని చంద్రబాబుకు రాష్ట్రంలో అధికారం ఇవ్వొద్దు’’ అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

                                     

About Author