డిప్యూటీ సీఎం సొంత నిధులతో..అభివృద్ధి
1 min read
తర్తూరులో జనసేన జెండా ఆవిష్కరించిన రామిరెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారని నందికొట్కూరు జనసేన పార్టీ నాయకులు శ్రీరామ థియేటర్ అధినేత ఎం రామిరెడ్డి అన్నారు.శనివారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సుబ్బన్న,సూర్యుడు,అశోక్,గని,సంజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ జనసేన నాయకులు రామి రెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ జేఎస్పీ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన సేవా రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా సాయం అందించారని నందికొట్కూరు నియోజకవర్గంలో తన ఇంటిపేరు కొణిదెల ఉన్నందున కొణిదెల గ్రామానికి తమ సొంత ట్రస్ట్ ద్వారా 50 లక్షల గ్రామ అభివృద్ధికి అదే విధంగా పాములపాడు మండలంలోని వరద పీడిత గ్రామాలు వేంపెంట, భాను ముక్కుల గ్రామాలకు రెండు లక్షల చొప్పున ఇచ్చారని కౌలు రైతులను తానే స్వయంగా పరామర్శించి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 32 కుటుంబాలకు 32 లక్షలు ఇచ్చి దాదాపు నియోజకవర్గంలో కోటి రూపాయల వరకు సాయం అందించారని అన్నారు.మద్దిలేటి మాట్లాడుతూ విలువలతో కూడిన సేవా రాజకీయాలు పవన్ కళ్యాణ్ కే సాధ్యమన్నారు.ఒక వైపు మార్క్ శంకర్ తన కుమారుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మరోవైపు ప్రజలకు ఇచ్చిన మాట కోసం మన్యం గ్రామాలను పర్యటించి 5 లక్షల సాయం అందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని సంపత్ అన్నారు.ఈ కార్యక్రమంలో రాము,సతీష్,రమణ, రాజు,పుష్ప రాజ్,సూర్య ప్రవీణ్,కీర్తి రమణ, శంకర్,నాగరాజు పాల్గొన్నారు.