ఏపీలోని 613 డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : అక్రమాలకు పాల్పడుతున్న 613 ప్రైవేటు డీఎడ్ కాలేజీల గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ డీఎడ్ (డైట్స్) కాలేజీలు 14 ఉండగా ప్రైవేటువి 780 వరకు ఉన్నాయి. గత ఏడాది ఇదే కారణంతో 167 కాలేజీల గుర్తింపును పాఠశాల విద్యా శాఖ రద్దు చేసింది. అవి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. వీటిలో కొన్ని మళ్లీ ఈ ఏడాది గుర్తింపునకు దరఖాస్తు చేశాయి. అయితే అవి సమర్పించిన పత్రాలు తప్పుడువని తేలడంతో వాటికి గుర్తింపు ఇవ్వలేదు. డీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్–2022 ప్రవేశ పరీక్షలు ఇటీవల జరిగాయి. వీటికి 5,800 మంది హాజరు కాగా 4,800 మంది అర్హత సాధించారు. ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దవడంతో ఈసారి డీఎడ్ కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ కాలేజీలకే పరిమితం చేయనున్నారు.