NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భ‌గ‌త్ సింగ్ వార‌సులం.. భ‌య‌ప‌డేది లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్‌ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్‌ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.

                                             

About Author