బెల్లం ఊట ధ్వంసం
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు SEB జాయింట్ డైరెక్టర్ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు DSP కే.వి. మహేష్ నేతృత్వంలో పరివర్తన కార్యక్రమం 2.0 లో భాగంగా కర్నూలు సెబ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధా సాగర్ రెడ్డి రావు ఆధ్వర్యంలో గురువారం కొల్లంపల్లితండా గ్రామ పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై విస్తృత దాడులు నిర్వహించారు. ఉలిందకొండ పోలీస్ సిబ్బంది తో కలిసి నిర్వహించిన దాడులో 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మండలంలో నాటుసారా, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సెబ్ ఎస్క్ష్మ సుధా సాగర్ రెడ్డి హెచ్చరించారు.