PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బెల్లం ఊట ధ్వంసం

1 min read
బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న సెబ్​ సీఐ లలితాదేవి, సిబ్బంది

బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న సెబ్​ సీఐ లలితాదేవి, సిబ్బంది

పల్లెవెలుగు వెబ్​, మహానంది: ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో నాటుసారా, అక్రమ మద్యం సరఫరాను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సెబ్ సీఐ లలితాదేవి తెలిపారు. శుక్రవారం గడివేముల మండలం దుర్వేసి గ్రామ సమీపంలో దాదాపు మూడువేల లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. అదేవిధంగా మహానంది మండలం లో కూడా దాడులు నిర్వహించి బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇసుక, మద్యం, సారా అక్రమ రవాణా తో పాటు ,పేకాట తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని, వివరాలు ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

About Author