అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్..
1 min readరాష్ట్ర ప్రజలు ఆయన పాలనపై విసిగిపోయారు..
ఏలూరు టి.డి.పి. ఇంచార్జ్ బడేటి చంటి
చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరు 16వ డివిజన్ వంగాయగూడెం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గురువారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్ళిన బడేటి చంటి టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తామని అందరికీ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా బడేటి చంటి మాట్లాడుతూ దళితులను అన్నివిధాలుగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలుస్తారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమానికి అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి వారికి ఎంతో అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అలాగే దళితులకు ఆర్ధికంగా చేయూతనందించే ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి ఎస్సీల ఆర్ధికాభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. ప్రతిచోటా నా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అంటూ ప్రేమ ఒలకబోసే జగన్మోహన్ రెడ్డి ఎస్సీల సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసిపి పాలనలో అవినీతి, అక్రమాల గురించి టిడిపి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి – జనసేన కూటమి ఘన విజయం సాధించడం తథ్యమని, ప్రతిఒక్కరూ ఈ రెండు నెలలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్ చోడే వెంకటరత్నం, డివిజన్ ఇన్‌ఛార్జ్ శ్రీకాకుళం రమేష్, ఆలూరి రవి, కలపాల కుమార్, ఆలూరి కిషోర్, తలపంటి రాంబాబు, సకలబత్తుల దివాకర్, కాటూరి శ్రీను, చల్లా రాఘవ, కొత్తపల్లి రాజు, శ్రీకాకుళం రాజు, శ్రీకాకుళం నాగరాజు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.