డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ జెండాను చించిన వారిపై చర్యలు తీసుకోవాలి
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: హొళగుంద మండలం లింగంపల్లి గ్రామంలో మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షుడు మహానంది ఆధ్వర్యంలో కొద్ది రోజుల కిందట దళితులైనటువంటి మేము భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం లింగంపల్లి గ్రామంలో భూమి పూజ చేయడం జరిగింది మరియు గ్రామకంఠం బంజారా దొడ్డి గవర్నమెంట్ స్థలంలో అంబేద్కర్ ఫ్లెక్సీని మరియు జండను ఆవిష్కరించడం జరిగింది అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్ర కులస్తులు దాన్ని చూసి జీర్ణించలేక నిన్నటి రోజున రాత్రి గ్రామానికి చెందిన కొంతమంది అగ్ర కులస్తులు ఫ్లెక్స్ ను మరియు జండా కట ను తొలగించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఘోరంగా అవమానపరిచి ఫ్లెక్సీ ని చింపడం జరిగింది దీనిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఫ్లెక్సీ చించిన వారినిగ్రామ బహిష్కరణ చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ యూత్ అధ్యక్షుడు వెంకటరాముడు మాల మహానాడు కన్వీనర్ భారత్ మాల మహానాడు నాయకులు మల్లికార్జున హనుమంతు రాముడు భీమలింగ మల్లి మూర్తి రమేష్ పాల్గొన్నారు.
