పంట పొలాలు నాశనం…
1 min read– రైతు గోడు పట్టదా.. ఇష్టం వచ్చినవారికి చెప్పుకో పో. పాత్రికేయులకు నిర్లక్ష్యంగా సమాధానం..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: అభివృద్ధి అంటూ పరిశ్రమల పేరుతో కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్య వైఖరికి అద్దం పట్టేలా గ్రామీణ రహదారులను నాశనం చేస్తూ భారీ వాహనాలతో దుమ్ములేపుకుంటూ పోతూ రైతుల పంట పొలాలపై దుమ్మెత్తి పోస్తున్నారు పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశలు పెట్టుకోవడం స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని సంస్థలు చెప్పడం ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతకు అవకాశం అందని ద్రాక్ష పండుల మారింది ఉన్న కొద్దిపాటి ఆదాయాన్ని లాక్కుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బడా కార్పొరేట్ సంస్థలకు అండగా నిలబడుతున్న స్థానిక నాయకులు ఇదేంటి అని అడగడం ఎప్పుడో మరిచిపోయారు కాదు కాదు మారిపోయారు స్థానిక ఓర్వకల్ మండల పరిధిలోని గుమ్మితం తాండ వద్ద గ్రీన్ కో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం రిజర్వాయర్ నిర్మాణానికి మంచాలకట్ట గ్రామం వద్ద ఎస్సార్ బీసీ కాలువ పరిధిలోని (బౌల్డర్స్) పెద్ద రాళ్లు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు దీనికోసం ఉన్న రహదారిని నాశనం చేసి పక్కన మట్టి తోలి అతివేగంతో టిప్పర్ల ద్వారా తరలించే సమయంలో చుట్టుపక్కల ఉన్న పొలాల్లో మొక్కజొన్న పంట మిరప తదితర పంటలపై దుమ్ము పేరుకొని పోయి పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉన్న పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు రోడ్డు క్యూరింగ్ అంటూ ఉదయం సాయంత్రం తూతు మంత్రంగా కొద్దిపాటి ట్యాంకర్ల ద్వారా నీరు చల్లి వదిలిపెడుతున్నారని ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా రాత్రి వరకు అతివేగంతో టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్న పట్టించుకునే నాధుడు లేడని … గని గ్రామస్తులు వాపోయారు మంచాలకట్ట గ్రామం నుండి బ్రాహ్మణపల్లి వెళ్లే వరకు ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు అతివేగంతో రేసుగుర్రాళ్ళ పరిగెడుతున్న టిప్పర్ల మధ్యలో ఎక్కడ నలిగిపోతామొనని ఆందోళన చెందుతున్నారు ఇదే విషయంపై నేను టిప్పర్ డ్రైవర్లకు నిదానంగా వెళ్లొచ్చు కదా అంటే నీ ఇష్టం వచ్చినోళ్లకు చెప్పుకోపో ట్రిప్పులు పడాలి మాకు అంటున్నారు. పాత్రికేయులకే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటే వీరి హోదా ఎంతవరకు ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు రైతుల జీవితాలు బాగు చేయకున్నా పర్లేదు కాని వారి పంటలు నాశనం కాకుండా ద్విచక్ర వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా టిప్పర్ డ్రైవర్లకు యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత గ్రీన్ కో పరిశ్రమకు ఉంది.