దేవాంగు కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: వస్త్ర రంగంలో ప్రధానమైన చేనేత కులములో మొత్తం 19 కులాలు ఉన్నాయని ,అందులో రాజకీయ పరివాషలో ఎస్ టి డి కులాలు ముఖ్యమైనవి. అంటే సాలి, తొగట డి అంటే దేవాంగ కులాలని నేటి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులు సాలి, తొగటలకు ఇచ్చిందని, మరి దేవాంగులకు ఎందుకు ఇవ్వలేదు? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రదేవాంగుల అధ్యక్షుడు దేవాంగ కర్ణ నాగరాజు స్థానిక గాంధీనగర్ లో ఆదివారం జరిగిన విలేకరులసమావేశంలో ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలలో మేము సేవలు అందిస్తున్నామని మమ్మల్ని విస్మరించడం మీకు తగదని కావున తక్షణమే మాకు ఒక ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టు కేటాయించాలని కోరారు. 2024 సంవత్సరం లోరాబోవు శాసనసభ ఎన్నికలలో అన్ని పార్టీలు మా దేవాంగ కులస్తులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించి చీరాల, రాజమండ్రి, పెద్దాపురం, పుట్టపర్తి, మరియు నాలుగు నియోజకవర్గాలలో మాకు ప్రాతినిధ్యం కల్పించాలని రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో హిందూపురం పార్లమెంటు స్థానం మా దేవాంగులకే కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు రాబోవు ఎన్నికలలో మేము తెలిపిన స్థానాలలో టిక్కట్లు ఇచ్చిన యెడల మా అభ్యర్థులను (ఏ పార్టీకి చెందిన వారైనా )సరే మా రాష్ట్ర సంఘం తరఫున ప్రచారం చేసి వినిపించుకుంటామని ఆయన అన్నారు. దేవాంగ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని, ఉచిత పీజిను విద్యను అందించాలి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని చేనేత ప్రధాన వృత్తికావడం వలన చేనేతలకు నూలు కొనుగోలు దగ్గర్నుండి వస్త్రం అమ్మకం జరిగే వరకు పలుమార్లు దశలవారీగా జీఎస్టీ అమలు చేస్తున్నారని ఇది చేనేతలకు మడ్డి విరుస్తున్నదని, కావున చేనేత వస్త్రాలపై నేత ముడి సరుకుల పై జిఎస్టి ఎత్తివేయాలని అర్హత ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరైన పద్ధతిలో అందడం లేదని మా దృష్టికి వచ్చిందని కావున ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని అందరికీ అందేలా చూడాలని సాంకేతిక కారణాలు ఏమన్నా ఉంటే వాటిని సరిచేసేందుకు చర్యలు చేపట్టాలని నెల్లూరులో చేనేతలకు, చెందిన 06 90 ఎకరాల స్థలమును చేనేత అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలనిఅధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ, కోశాధికారి ఉప్పు కనకరాజు, రాష్ట్ర నలుమూలల నుండి ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.