దేవరగట్టు దసరా ఉత్సవాల(బన్ని) పోస్టర్ విడుదల
1 min readరాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు
ఈ నెల 19:10:2023 నుండి 28:10:2023 వరకు దసరా ఉత్సవాలు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయండి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: హొళగుంద మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దేవరగట్టు శ్రీశ్రీశ్రీ మళా మలేశ్వరస్వామి దసరా ఉత్సవాలు ఈ నెల 19వ తేదిన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆలూరు పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీశ్రీశ్రీ మళా మలేశ్వరస్వామి సంబంధించిన పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవరగట్టు బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అని తెలిపారు.ఈ బన్ని ఉత్సవం విజయదశమి పండుగ రోజు అంటే 24వ తేది నిర్వహించబడను అని తెలియజేశారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు త్వరలో పూర్తి చేయడం జరిగిందని అని తెలిపారు.అలాగే ప్రతి ఒక్కరూ అన్నదమ్ములా పండుగ వాతావరణంలాగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని తెలిపారు.ఈ బన్ని ఉత్సవం కోసం ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వస్తారు. వారికి ఏటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ ,మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి , నెరణికి,నెరణికి తండా,కొత్తపేట గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.