పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి..
1 min readరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కి సిపిఐ వినతి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలోని సప్తనదుల సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడుహెడ్ రెగ్యులేటర్,రోల్లపాడు అభయారణ్యం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరుతూ శనివారం ముచ్చుమర్రి కి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, షాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సిపిఐ జిల్లా నాయకులు వి.రఘురామమూర్తి ఎం.రమేష్ బాబులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గ రైతులు ప్రజల త్యాగ ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఈ ప్రాంతం తప్ప అన్ని ప్రాంతాల రైతులు సాగునీరు అందుతూ అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని నందికొట్కూరు మాత్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. రాయలసీమ తాగునీటి అవసరాలకు నిలయంగా నందికొట్కూరు ప్రాంతం ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అనేక జంతు పక్షి సంపదలకు నిలయంగా ఉన్న రోల్లపాడు అభయారణ్యం వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కలిగి ఉందని అక్కడ పర్యాటక కేంద్రంగా గుర్తించాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాయలసీమ ప్రాంత తలమానికమని అత్యంత సుందరవణంగా ఆ ప్రదేశం ఉంటుందని పర్యాటక కేంద్రంగా గుర్తిస్తే చాలా ఉపయోగపడుతుందన్నారు. అక్కడ ఫిస్ యార్డును ఏర్పాటు చేయాలన్నారు.కొత్తపల్లి లోని కొలను భారతి,సప్త నదుల సంగమేశ్వరం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయలు అని అక్కడే సిద్దేశ్వరం పై వంతెన నిర్మిస్తున్నారని అక్కడ పర్యాటక కేంద్రంగా గుర్తించాలని వారు కోరారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంలో ఏంతో విశాలమైన వాతావరణం కలిగి ఉందని అక్కడ కూడా అభివృద్ధి చేయడానికి పర్యాటక కేంద్రం గుర్తించి బోట్లు నడిచే విధంగా కృషి చేయాలని ఈ సమస్యలు తక్షణం పరిష్కారం కోసం మా నియోజకవర్గానికి పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేయాలని వారు మంత్రి ని కోరారు.ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారు.